ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధప్రాతిపదికన అన్నమయ్య గేట్ల పునరుద్ధరణ

ABN, First Publish Date - 2020-11-30T05:09:44+05:30

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లను తిరిగి పునరుద్ధరించారు. సాంకేతిక లోపాలు ఏర్పడ్డ గేట్లను పునరుద్ధరించి వరద నీటిని మళ్లీ ప్రాజెక్టులో నింపుతున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నమయ్య ప్రాజెక్టులో తిరిగి చేరుతున్న వరదనీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరిగి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నింపుతున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారిక ప్రకటన 

సోమవారం నాటికి 2టీఎంసీల నీటిని నింపనున్నట్లు వెల్లడి 

రాజంపేట, నవంబరు 29: అన్నమయ్య ప్రాజెక్టు గేట్లను తిరిగి పునరుద్ధరించారు. సాంకేతిక లోపాలు ఏర్పడ్డ గేట్లను  పునరుద్ధరించి వరద నీటిని మళ్లీ ప్రాజెక్టులో నింపుతున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నాటికి రెండు టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నింపనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టులోకి 33 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోందని, సోమవారం నాటికి రెండు టీఎంసీల నీటిని నింపుతామని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం 2.4 టీఎంసీలు కాగా, డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకొని 2 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు.

ప్రాజెక్టులో నిల్వ చేసిన నీరు వృథాగా పోయిందని రైతులు బాధపడాల్సిన పని లేదని, యుద్ధప్రాతిపదికన గేట్లను పునరుద్ధరించి ప్రాజెక్టులో నీటిని నింపుతున్నామని వెల్లడించారు. ప్రాజెక్టుల మాజీ సలహాదారు, మెకానికల్‌ గేట్స్‌ నిపుణులు కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రాజెక్టు గేట్లను ఏర్పాటు చేసిన స్వప్ణ కనస్ట్రక్షన్స కంపెనీ, మొరాయించిన గేట్లను తిరిగి పునరుద్ధరించిందన్నారు. రాష్ట్ర మెకానికల్‌ ఈఈ శేఖరయ్య, స్థానిక ఈఈలు రవికిరణ్‌, రమేష్‌ నేతృత్వంలో గేట్ల పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. కాగా కలెక్టర్‌ ఆదేశాలతోనే వరద నీటితో నిండిన డ్యామ్‌ గేట్లను ఎత్తడం జరిగిందని, లేకపోతే డ్యామ్‌కు ముప్పు వాటిల్లేదని ఇరిగేషన ఈఈ వెంకట్రామయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - 2020-11-30T05:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising