ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సప్‌ ద్వారా ప్రశ్నాపత్రాలు : డీఈఓ

ABN, First Publish Date - 2020-05-25T10:29:41+05:30

టెన్త్‌ విద్యార్థులకు నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు డీపీసీబీ ఆధ్వర్యంలో రెండు మోడల్‌ పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), మే 24: టెన్త్‌ విద్యార్థులకు నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు డీపీసీబీ ఆధ్వర్యంలో రెండు మోడల్‌ పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు డీఈఓ శైలజ తెలిపారు. పరీక్షలకు ముందు వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రం ఉంచుతున్నామని దానిని ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని వాట్సప్‌ ద్వారా విద్యార్థులకు పంపించాలని సూచించారు. విద్యార్థులు ఇంటి వద్దే పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరుగుతాయని, అదే రోజు మధ్యాహ్నం జవాబులను (ప్రిన్సిపాల్‌ ఆఫ్‌ వాల్యుయేషన్‌) మధ్యాహ్నం 3 నుంచి వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. వీటిని కూడా వాట్సప్‌ ద్వారా పంపిస్తే విద్యార్థులే వారి జవాబు పత్రాలు దిద్దుకోవాలని సూచించారు. ఈ నెల 28 నుంచి జూన్‌ 7 వరకు మొదటి నమూనా పరీక్ష జూన్‌ 10 నుంచి 20 వరకు రెండో నమూనా పరీక్ష ఉంటుందన్నారు. 


పరీక్షల వివరాలు

మొదటి ఆన్‌లైన్‌ పరీక్ష 28న తెలుగు, 30న హింది, జూన్‌ 1న ఇంగ్లీషు, 3న గణితం, 5న జనరల్‌ సైన్స్‌, 7న సోషల్‌ స్టడీస్‌ ఉంటాయి. రెండో పరీక్ష జూన్‌ 10 నుంచి జరుగుతుందని, 10న తెలుగు, 12న హింది, 14న ఇంగ్లీషు, 16న గణితం, 18న జనరల్‌ సైన్స్‌, 20న సోషల్‌ స్టడీస్‌ జరుగుతాయని తెలిపారు.

Updated Date - 2020-05-25T10:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising