ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులివెందులలో ప్రశ్నార్థంగా లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2020-04-08T09:17:32+05:30

పులివెందులలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనా ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోలేదు. పోలీసులు ఎంత చెప్పి నా ఇష్టమొచ్చినట్లు రోడ్లపైనే తిరుగుతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బయటకు రావద్దని ప్రజలకు సూచన 

‘స్వచ్ఛంద’ నిర్వాహకులకు అధికారుల వినతి


పులివెందుల/పులివెందుల రూరల్‌,/ వేంపల్లె/సింహాద్రిపురం/ చక్రాయపేట/సంబేపల్లె, ఏప్రిల్‌ 7: 

పులివెందులలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనా ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోలేదు. పోలీసులు ఎంత చెప్పి నా ఇష్టమొచ్చినట్లు రోడ్లపైనే తిరుగుతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో కరోనా సృష్టిస్తున్న భయానకం టీవీల్లో చూస్తు న్నా ప్రజల్లో మార్పు రావడంలేదు. గత వారంలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో నాలుగు రోజుల్లోనే ఇంకో రెండు కేసులు నమోదవు తూ కరోనా మహమ్మారి చాపకింద నీరులా చొచ్చుకు వస్తున్నా కుటుంబాలను రక్షించుకోవాలనే ధ్యాస లేకపోవడం దారుణం.


పాజిటివ్‌ నమోదైన వారి ఇళ్ల వద్ద రెడ్‌జోన్‌ ప్రకటించినా మిగతా ప్రాంతాల్లో ప్రజలు బయట తిరిగారు. పులివెందులలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనా ప్రజలు బయటకు వస్తుండడంతో బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు.


ఆయా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పారిశు ధ్య కార్మికులు, వైద్యసిబ్బంది, యాచకులు, నిరాశ్రయులకు కూరగాయలు, భోజనం అందించాలని తహసీల్దార్‌ శ్రీనివాసులు, సీఐ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి స్వచ్ఛంద సంస్థల నిర్వహకులను కోరారు. 


వేంపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు ఇబ్బందు లు పడకుండా జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి కూరగాయలను ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించినట్లు తెలిపారు. వైసీపీ తరపున రాజీవ్‌కాలనీ, క్రిస్టియన్‌ కాలనీ, హరిజనవాడ తదితర కాలనీల్లో అందించారు. అనాథలు అన్నం కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని లౌవ్‌లీ హేర్‌స్టైల్‌ నిర్వాహకుడు బాలసుబ్రహ్మణ్యం ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 


సింహాద్రిపురంలోని రెండు ఎస్సీ కాలనీల్లో సుమారు 450 కుటుంబాలకు  మాజీ సర్పంచ్‌ రామ్మోహన్‌రెడ్డి  సొంత ఖర్చుతో మాస్క్‌లు పంపిణీ చేశారు.


చక్రాయపేట మండలంలో మారుమూల ప్రాంతం కల్లూరుపల్లెలో టీచర్‌ గోపాల్‌నాయక్‌, రెడ్డి నాయక్‌ 950 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. 


సంబేపల్లె మండలం నామాలగుట్టలోని వలస కార్మికులకు రాయచోటి రూరల్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజారమేష్‌ కూరగాయలను పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-08T09:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising