ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ ఏర్పాటుపై రగడ

ABN, First Publish Date - 2020-04-05T09:14:03+05:30

పట్టణంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం, ఏప్రిల్‌ 4 : పట్టణంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకుని స్థానికులు గొడవ చేశా రు. శనివారం ఉదయం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు, కమలాపురం నియోజ కవర్గ ప్రత్యేక అధికారి నాగరాజుతో పాటు వైద్యులు గురుకుల పాఠశాల వద్దకు వెళ్లి క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు. విషయం తెలు సుకున్న ప్రజలు అక్కడికి పెద్దఎత్తున వెళ్లి నివాస కేంద్రంలో క్వారంటైన్‌ వద్ద ని తెలియజేశారు. కాగా గురుకుల పాఠశాలలో ఉన్న భవనం తాజా మాజీ ఎంపీపీ సులేఖ కుటుంబానికి సంబంధించినవి కావడంతో ప్రజలు సులేఖ భర్త సుబ్రమణ్యం దృష్టికి ఈ విషయం తీ సుకెళ్లారు. ఆయన తమ భవనంలోకి ఎవ రూ వెళ్లకుండా అధికారులను బయటికి పంపి తాళాలు వేశారు. ఈ విషయమై అధికారులు పోలీసులకు తెలియజే యడం తో పోలీసులు సుబ్రమణ్యంను పిలిపించి మాట్లాడారు.


కానీ గురుకుల పాఠశాలకు అద్దెకు ఇచ్చానని, ఆ భవనంలో వారు వేరే అవసరాలకు వాడుకుంటానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని, క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేయనిచ్చే ప్రసక్తి లేదన్నారు. ఆ విష యాలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు అక్కడ కేంద్రం ఏర్పాటు చేయకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న కమలాపురంలోని ప్రజలు పెద్దఎత్తున పోలీసుస్టేషన్‌, అధికా రుల వద్దకు రావడంతో సుబ్రమణ్యంను అక్కడి నుంచి పంపించారు. అనంతరం వందల మంది ప్రజలు క్వారంటైన్‌ కేంద్రం వద్దకు చేరుకుని చర్చించారు.


పలువురు వైసీపీ నేతలు అక్కడికి చేరుకుని చర్చించారు. తాము కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ కేంద్రం లేకుండా చూస్తామన్నారు. కాగా అధికారులు మాత్రం ఇక్కడ కేంద్రం ఏర్పా టుకు కలెక్టరు అనుమతిచ్చారని,తాము ఏర్పాటు చేయమని చెప్పేందుకు వీలుకాదన్నారు. ఈ విషయం కలెక్టరుతో మాట్లాడాలని పేర్కొన్నారు. కారం టైన్‌ కేంద్రాన్ని ఎక్కడైనా ఊరు వెలుపల, ఇతర ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు విన్నవిస్తున్నారు.

Updated Date - 2020-04-05T09:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising