ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ప్రసాదానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2020-05-26T05:30:00+05:30

లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం భక్తులకు కరువైన నేపధ్యంలో శ్రీవారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యాహ్నానికే 20 వేల లడ్డూల విక్రయం


కడప (కల్చరల్‌), మే 25 : లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం భక్తులకు కరువైన నేపధ్యంలో శ్రీవారి ప్రసాదం అందుబాటులోకి తేవాలని టీటీడీ సంకల్పించింది. అందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలకు, జిల్లా కేంద్రాలకు శ్రీవారి లడ్డూలను చేరవేశారు. సోమవారం కడపలోని టీటీడీ కల్యాణమండపం వద్ద లడ్డూలకోసం భక్తులు బారులు తీరారు.


సామాజిక దూరం పాటిస్తూ లడ్డూ కౌంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాస్కులు, ధరించి వచ్చిన వారికే లడ్డూలు విక్రయించారు. తొలిరోజు 20 వేల లడ్డూలు మధ్యాహ్నానికే అమ్ముడుపోయాయి. మంగళవారం మరో 20 వేలు తెప్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8-12, మధ్యాహ్నం 3-6 గంటల మధ్య లడ్డూల విక్రయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీటీడీ కడప ఇన్‌చార్జి హర్షవర్ధన్‌రెడ్డి, కల్యాణమండపం మేనేజర్‌ ఇళయరాజా, శ్రీవారి సేవా ఇన్‌చార్జి బెస్తవేముల రాంమహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising