ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతాంగాన్ని ఆదుకోవాలి : రెడ్యం

ABN, First Publish Date - 2020-11-30T04:34:44+05:30

నివర్‌ తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పైర్లు తీవ్రంగా నష్టపోయి రైతన్నకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని వెంటనే వారిని ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఖాజీపేట మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న రెడ్యం త దితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పైర్లు తీవ్రంగా నష్టపోయి రైతన్నకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని వెంటనే వారిని ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఖాజీపేట మండలం రహ్మతఖానపల్లె, పుల్లూరు, ఆంజనేయకొట్టాలు, వెంకటాపురం, తదితర గ్రామాల్లో తుఫానుతో దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. వరుస తుఫానులతో తీవ్రంగా దెబ్బతిన్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా రైతులు కన్నీళ్లపర్యంతమయ్యారు లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రెడ్యం సోదరుల ఎదుట వాపోయారు. రెడ్యం స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ పరిధిలో 72 వేల హెక్టార్లలో ఉద్యానవన శాఖ పరిధిలో 365 ఎకరాల్లో పైర్లు  దెబ్బతిన్నాయని అధికారులు అం చనా వేశారన్నారు. కానీ వాస్తవంగా అంతకంటే ఎక్కువగానే పంటలు దెబ్బతిన్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా గొర్రెలు, మేకలు, పశువు లు కొట్టుకుపోయాయని, మరికొన్ని చనిపోయాయన్నారు. వాటికి కూ డా నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వీటన్నింటిపై తాను సీఎం జగనమోహనరెడ్డికి లేఖ రాశానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నంద్యాల సుబ్బయ్యయాదవ్‌, పల్లె వెంకటరెడ్డి, కమలాపురం గౌస్‌మొద్దీన, పల్లె గంగాధర్‌, జెండాల మహబూబ్‌బా షా, తవ్వ పెద్దసుబ్బారెడ్డి, సుధాకర్‌, మునగాని శివప్రసాద్‌, కోటసుబ్బారెడ్డి, వెంకటరమణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T04:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising