ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-05-17T11:19:01+05:30

ఆర్టీసీలో గత కొన్ని సంవత్సరాలుగా అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను లాక్‌డౌన్‌ పేరుతో తొలగించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (మారుతీనగర్‌), మే 16 : ఆర్టీసీలో గత కొన్ని సంవత్సరాలుగా అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను లాక్‌డౌన్‌ పేరుతో తొలగించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఉత్తర్వులను పునఃపరిశీలన చేసి వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జోనల్‌ అధ్యక్ష, కార్యదర్శులు కేకే కుమార్‌, ఎన్‌.రాజశేఖర్‌ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తొలగించరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఆదేశాలు ఇవ్వడం బాధాకరమన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7600 మంది పేద కుటుంబాలకు చెందిన చిరుద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. వారిని తొలగించే ప్రక్రియను నిలుపుదల చేసి కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-05-17T11:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising