బెంగళూరు నుంచి కాలినడకన...
ABN, First Publish Date - 2020-03-27T09:43:24+05:30
కర్నాటక రాజధాని బెంగళూరు నుంచి కొందరు యువకులు గురువారం ఉదయం కాలినడకన జిల్లా సరిహద్దుల్లో ప్రవేశించారు.
చిన్నమండెం, మార్చి 26: కర్నాటక రాజధాని బెంగళూరు నుంచి కొందరు యువకులు గురువారం ఉదయం కాలినడకన జిల్లా సరిహద్దుల్లో ప్రవేశించారు. వీరు కడప, బద్వేలు తదితర ప్రాంతీయులుగా తెలిపారు.జిల్లా వాసులే అయినా ఉద్యోగ రిత్యా బెంగళూరులో ఉండడంతో లాక్ డౌన్ కారణంగా స్వగ్రామాలకు తరలి వస్తున్నారు. రవాణా సౌకర్యం లేక పోవడంతో కాలినడకన వస్తున్నట్లు తెలిపారు. రహదారుల్లో ఏవైనా వాహనాలువస్తే వాటిని అపి.. అవి ఎంత దూరం వెళ్తే అంతవరకు వెళ్తూ వస్తున్నారు. ఇలా సుమారు. 10 నుంఛి 15 మంది దాకా గురువారం జిల్లా సరిహద్దులలోని కేశాపురం చెక్‌పోస్టును దాటి వచ్చారు.
Updated Date - 2020-03-27T09:43:24+05:30 IST