ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30లోపు నష్టపరిహారం ఇస్తాం : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-11-30T04:32:19+05:30

తుపాన్‌ వర్షం వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, డిసెంబరు 30 లోపు నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు.

దెబ్బతిన్న వరిపైరును ఎమ్మెల్యేకు చూపుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు రూరల్‌, నవంబరు 29: తుపాన్‌ వర్షం వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, డిసెంబరు 30 లోపు నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని గుంటూరు కొట్టాలు, మండలం లోని అన్నలూరు తదితర గ్రామాల్లో తహసీల్దారు ప్రేమంతకుమార్‌, వ్యవసాయాధికారి లక్ష్మి ప్రసన్న తో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయ న మాట్లాడుతూ పంట ఉత్పత్తులు చేతికొచ్చే సమ యంలో తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నా రు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లి అధికారులతో విచారణ జరిపి నివేదిక అం దిస్తామని, డిసెంబరు 30లోపు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు  పాల్గొన్నారు. 

చాపాడు మండలంలో....

చాపాడు, నవంబరు 29: భారీ వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు.  అన్నవరం, చియ్యపాడు, మడూరు గ్రామాల పరిధి లో దెబ్బతిన్న పంటలను ఆదివారం ఉదయం ఆయన పరిశీలించారు. ఇప్పటికే కోసిన వరి ధా న్యం నీటిలోనే మునిగి ఉందన్నారు. మండలంలో దెబ్బతిన్న పైర్లకు సంబందించిన వివరాలను త్వర గా తయారు చేయాలని ఎమ్మెల్యే మండల వ్యవ సాయాధికారి మ్యాగి, ఎంపీడీఓ శ్రీధర్‌నాయుడుకు సూచించారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ నేతలు లక్షు మయ్య, జయరామిరెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, రామ మోహనరెడ్డి, బాలనరసింహారెడ్డి, వెంకటరమణా రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-30T04:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising