14 వరకు లాక్‌డౌన్
ABN, First Publish Date - 2020-03-27T09:41:34+05:30
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏప్రిల్ 14 వరకు ప్రధాని మోదీ లాక్‌డౌన్ ప్రకటించారని
కడప(కలెక్టరేట్) మార్చి 26: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏప్రిల్ 14 వరకు ప్రధాని మోదీ లాక్‌డౌన్ ప్రకటించారని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనావ్యాప్తి జరగకూడ దంటే ప్రజలు సహకరించాలన్నారు. లేదంటే ప్రభుత్వా లు కఠిన నిర్ణయాలు తీసుకుంటాయ న్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూ రగాయలు, సరుకులు కొనాలన్నారు. పాలు సాయం త్రం 6గంటల వరకు అమ్మకాలు చేయవచ్చ న్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకూ రోడ్లపైకి ఎవ్వరూ రాకూడదని హెచ్చరించారు.
24 గంటలపాటు మెడికల్ షాపులు అందుబాటులో ఉం టాయన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులోకి వచ్చిం దని నలుగురుకి మించి ఉండకూడదన్నారు. ఆలయా లు, మసీదులు, చర్చిలల్లో తాత్కాలికంగా ప్రార్థనలు నిలిపివేశామన్నారు. జాతరలు నిర్వహించకూడదన్నా రు. రైతులు పండించే అరటి, మామిడి పంటలు ఏ మార్కెట్లో అయినా అమ్ముకోవచ్చని సూచించారు.
వీటికి మినహాయింపు
కొన్ని ప్రభుత్వ శాఖలకు మినహాయింపులు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. అందులో విద్యుత్, బ్యాంకులు, ట్రెజరీ, ఏటీఎం, రైల్వే, మెడికల్, పారిశుధ్యం, పాత్రికేయులు, రేషన్‌షాపులు, పెట్రోల్, గ్యాస్ తదితరాలకు అనుమతులు ఇస్తూ ఎస్పీకి తెలియజేశామన్నారు. ప్రజలందరూ కరోనా వైరస్‌ను తుదిముట్టించేలా స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, శిక్షణ కలెక్టర్ శ్రీవాస్‌నుపూర్, జేసి-2 శివారెడ్డి, డీఆర్వో రఘునాధ్, డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ ఉమాసుందరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-27T09:41:34+05:30 IST