మా బతుకులతో ఆడుకోవద్దు
ABN, First Publish Date - 2020-12-29T05:24:54+05:30
యూసీఐఎల్ ప్రాజెక్టు ప్రమాద స్థాయిలో భూగర్భజలాలు కలుషితం చేసిందని, తమ బతుకులకు రక్షణ కరువైందని ఆదుకోవాలంటూ యూసీఐఎల్ ప్రాజెక్టు బాధితులు సోమవారం కలెక్టర్ హరికిరణ్‌ను కలసి తమ ధీనగాధను విన్నవించారు.
కలెక్టర్‌కు యురేనియం బాధితుల మొర
కడప(కలెక్టరేట్), డిసెంబరు 28: యూసీఐఎల్ ప్రాజెక్టు ప్రమాద స్థాయిలో భూగర్భజలాలు కలుషితం చేసిందని, తమ బతుకులకు రక్షణ కరువైందని ఆదుకోవాలంటూ యూసీఐఎల్ ప్రాజెక్టు బాధితులు సోమవారం కలెక్టర్ హరికిరణ్‌ను కలసి తమ ధీనగాధను విన్నవించారు. ఈ సందర్భంగా బాధితుల తరుపున సాంబశివారెడ్డి, శివకుమార్ రెడ్డి, శశిధర్‌లు మాట్లాడుతూ అధికారులు పాలకుల కనుసన్నల్లో నడుచుకుంటూ తమకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ, చెన్నై ప్రాంతీయ కార్యాలయం పరిశీలనలో గుర్తించిన 9 షరతుల ఉల్లంఘనలు యూసీఐఎల్ ప్రాజెక్టు వెంటనే ఉసంహరించుకోవాలని వారు కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-12-29T05:24:54+05:30 IST