ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరువురు మహిళా దొంగలు అరెస్టు

ABN, First Publish Date - 2020-12-31T05:05:02+05:30

కడప ఆర్టీసీ బస్టాండు వద్ద ప్రయాణికులు బస్సులు దిగుతూ ఎక్కుతున్న సమయంలో వారిని ఏమార్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు మహిళా దొంగలను చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సునీల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

70 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం


కడప(క్రైం), డిసెంబరు 30: కడప ఆర్టీసీ బస్టాండు వద్ద ప్రయాణికులు బస్సులు దిగుతూ ఎక్కుతున్న సమయంలో వారిని ఏమార్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు మహిళా దొంగలను చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. కడప సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో కడప డీఎస్పీ సునీల్‌, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, సీఐ, ఎస్‌ఐలు సత్యనారాయణ, అమర్‌నాధరెడ్డిలతో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి  వివరాలు వెల్లడించారు. కడప అక్కాయపల్లెకు చెందిన షేక్‌ రహీమున్‌ ప్రస్తుతం మరాఠివీధిలోని భవానీనగర్‌లో నివాసం ఉంటోంది. అలాగే షేక్‌ బీబీజాన్‌ ఆర్టీసీ బస్టాండులో తిరుగుతూ మహిళలు బస్సు ఎక్కి, దిగే సమయాల్లో వీరు కూడా తోటి ప్రయాణికుల మాదిరి కలిసిపోయి వారి బ్యాగులను కొట్టేసి అందులో విలువైన వస్తువుల చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. రవీంద్రనగర్‌కు చెందిన షేక్‌ షబానా బస్సు ఎక్కుతున్న సమయంలో ఇరువురు మహిళా దొంగలు ఆమెను ఏమార్చి బంగారు నగలు చోరీ చేయడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బస్టాండు ఆవరణంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి దొంగల ఆచూకీ గుర్తించి చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, సిబ్బందితో ఇరువురిని అరెస్టు చేసి 70 గ్రాములు బంగారు వస్తువులను రికవరీ చేసి వారిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు.


వివాహిత ఆత్మహత్య


చిన్నమండెం, డిసెంబరు 30: మండలంలోని దేవగుడిపల్లెలో నివాసం ఉంటున్న వెంకటసుబ్బమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త సుబ్బరాయుడు మద్యానికి బానిసై నిత్యం వేధించేవాడని, అతడి వేధింపులు తట్టుకోలేక మంగళవారం రాత్రి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


మహిళ మెడలో బంగారు చైను చోరీ


సంబేపల్లె, డిసెంబరు 30: మండలంలోని పెద్దబిడికి గ్రామానికి చెందిన మూడే జలజమ్మ బంగారు చైనును గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని వెళ్లినట్లు బాధితురాలు బుధవారం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు.. బాధితురాలి వయస్సు 70 సంవత్సరాలు. భార్యా, భర్తలిద్దరూ మాత్రమే ఇంటిలో ఉన్నట్లు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నిద్రిస్తున్న ఆమె మెడలో ఉన్న బంగారు సరుడును లాక్కొని వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


పెన్నానదిలో మహిళ శవం లభ్యం


సిద్దవటం, డిసెంబరు 30 : సిద్దవటం ఆకులవీధి సమీపంలో పెన్నానదిలో బుధవారం ఉదయం ఓ మహిళ శవం కనిపించింది. వంతాటిపల్లె గ్రామానికి చెందిన బూసి నారాయణమ్మ (68)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం పోలీసులు అక్కడికి చేరుకున్ని శవాన్ని బయటకు తీశారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని మృతికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-12-31T05:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising