ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవోపేతం గుగ్గిళ ం జ్యోతుల పూజలు

ABN, First Publish Date - 2020-12-15T05:14:01+05:30

కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ఉదయం వీరభద్రస్వామికి, అఘోరలింగేశ్వరస్వామికి పంచామృత, రుద్రాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా సుగంధ పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించారు.

గుగ్గిళం జ్యోతులను ఆలయం చుట్టూ ప్రదర్శిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి టౌన్‌, డిసెంబరు 14: రాయచోటిలోని భద్రకాళీ సమేత వీర భద్రాలయంలో  సోమవారం గుగ్గిళం జ్యోతుల పూజలు నిర్వహించారు. కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ఉదయం వీరభద్రస్వామికి, అఘోరలింగేశ్వరస్వామికి పంచామృత, రుద్రాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా సుగంధ పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించారు. భస్మాలంకారములోని అఘోరలింగేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. భద్రకాళీ అమ్మవారిని వివిధ రంగుల గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం కర్ణాటక భక్తులచే గుగ్గిళం జ్యోతుల పూజ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన పాత్రలల్లో పెద్దపెద్ద దీపం వత్తులను పెట్టి వెలిగించి వాటిని తలపైన పెట్టుకుని ఆలయం చుట్టూ ఊరేగారు. గుగ్గిళం పూజల్లో భాగంగా కర్ణాటక భక్తులు వీరశైవ నృత్యాలతో ఆకట్టుకున్నారు. స్థానిక భక్తులతో పాటు అధిక సంఖ్యలో కన్నడ భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో మంజుల, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising