ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప వన్ టౌన్‌ పీఎస్‌ దగ్గర దారుణం!

ABN, First Publish Date - 2020-05-31T16:30:38+05:30

కడప నగరంలో దారుణం జరిగింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : కడప నగరంలో దారుణం జరిగింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఓ వ్యక్తిని యువకులు గొంతు కోసి దారుణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకెళితే.. బాలాజీ, శాలు, ఖాదర్ భాషా ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. అయితే మనస్పర్థలు రావడంతో బాలాజీ, శాలులపై ఖాదర్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఖాదర్.. నిద్రిస్తున్న బాలాజీ, శాలులను చంపాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మొదట బాలాజీ గొంతు కోయడానికి రాగా శాలు.. ఖాదర్‌ను అడ్డుకున్నాడు. దీంతో శాలుపై కూడా దాడి చేయాలని చూశాడు. 


వాళ్లిద్దరూ అప్రమత్తమవ్వడంతో ఖాదర్‌ పరుగులు తీశాడు. ఆ ఇద్దరు వెంబడించటంతో నగరంలోని వన్‌ టౌన్ స్టేషన్ ఎదురుగా ఖాదర్ కిందపడిపోయాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో శాలు.. ఖాదర్ గొంతు కోశాడు. విషయం గమనించిన స్టేషన్ సిబ్బంది ఆ ఇద్దర్ని అడ్డుకుని.. గాయపడిన ఖాదర్‌ను రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. ఖాదర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ  ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-05-31T16:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising