ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసీకి సీఎం క్షమాపణ చెప్పాలి - తులసిరెడ్డి

ABN, First Publish Date - 2020-03-23T09:48:43+05:30

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, మార్చి 22: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. కరోనా ఎఫెక్ట్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించగా రాష్ట్రంలో స్థానిక సం స్థల ఎన్నికలను కమిషనర్‌ వాయిదా వేశారు.  కరోనాను సాకుగా చూపుతూ కుట్ర పూరితం గా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు  అడ్డు కునేందుకే ఎన్నికలు వాయిదా వేశారని ఎన్నికల కమిషనర్‌ను దూషించారని గుర్తుచేశారు. నిధులు రాకుంటే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని, అందుకే ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను వాయిదా వేసిందని, ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే విమర్శలు గుప్పించారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించి, కమిషనర్‌ చెప్పినట్లుగానే 14వ ఆర్థిక సం ఘం నిధులు రూ.1301కోట్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-03-23T09:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising