ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు చెక్కులు పంపిణీ

ABN, First Publish Date - 2020-11-03T10:53:34+05:30

కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎర్రముక్కపల్లె), నవంబరు 2 : కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా మాట్లాడుతూ గత మే మాసంలో కడప డిపోకు చెందిన ఎస్‌.రమణమ్మ అనే కండక్టరు కరోనా సోకి మృతి చెందిందన్నారు. కడప ఆర్టీసీ జోన్‌ వర్క్‌షాపుకు సంబంఽధించిన సాదిక్‌ ఆలీ బ్లాక్‌స్మిత్‌గా పనిచేస్తూ కరోనాతో మృతి చెందాడన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చి కరోనాతో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపధ్యంలో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ఆదం సాహెబ్‌, ఆర్‌ఎం జితేంద్రనాధరెడ్డి, సీఎంఈ భాస్కర్‌, డీఎం నిరంజన్‌, ఆర్టీసీ అసోసియేషన్‌ నాయకులు బాబా ఫకృద్దీన్‌, బాల వెంకటేశ్‌, రెడ్డిబాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T10:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising