రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2020-11-03T10:47:42+05:30
జమ్మలమడుగు నగర పంచా యతీ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్వాలా నరసింహులు (29) అనే వ్యక్తి మృతి చెందాడు.
జమ్మలమడుగు రూరల్, నవంబరు 2: జమ్మలమడుగు నగర పంచా యతీ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్వాలా నరసింహులు (29) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... ప్రొద్దు టూరు మండలం బొల్లవరంలోని వెంకటేశ్వరకొట్టాలుకు చెందిన నరసింహులు ఆదివారం పెద్దముడియం మండలంలోని కొండసుంకేసుల గ్రామానికి వెళ్లి ఓ కార్యక్రమానికి వెళ్లాడు. కార్యక్రమం ముగించుకుని తిరిగి రాత్రి ప్రొద్దుటూరుకు స్కూటీలో పెద్దన్న అనే వ్యక్తితో కలిసి వస్తుండగా జమ్మలమడుగు బైపా్‌సరోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందగా పెద్దన్న గాయపడ్డాడు. మృతుడికి భార్య సువర్ణ, ముగ్గురు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-11-03T10:47:42+05:30 IST