ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మించుకోమన్నారు... డబ్బు ఇవ్వడం మరిచారు

ABN, First Publish Date - 2020-10-04T06:21:42+05:30

గోకులం షెడ్లు నిర్మిం చుకోమన్నారు. వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహి స్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 66 గోకులం షెడ్ల నిర్మాణదారుల ఆవేదన

 రూ. 78 లక్షల కోసం ఎదురు చూపులు

 దరఖాస్తు దారులు 80 మంది-మంజూరైనవి 80

 పనులు ప్రారంభించింది 66 మంది

 రైతులు చేసిన ఖర్చు రూ. 78 లక్షలు

 కూలీ ఖర్చుల కింద ప్రభుత్వం చెల్లించినది రూ. 4.22 లక్షలు


అట్లూరు, అక్టోబరు 3: గోకులం షెడ్లు నిర్మిం చుకోమన్నారు. వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహి స్తున్నారు. ఇప్పటికే నిర్మించుకున్న 66 మంది నిర్మాణదారులు డబ్బు కోసం ఎదురు చూస్తు న్నారు.


వివరాల్లోకెళితే...   

 గత ప్రభుత్వం 90 శాతం రాయితీతో రైతులకు మినీ గోకులాలను మంజూరు చేసింది.  ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో రైతులు తమ వంతు మొత్తాన్ని చెల్లించడమే కాకుండా అప్పు తీసుకొచ్చి షెడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని బిల్లుల రూపంలో ఇచ్చే సమయానికి ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ విషయంలో చేతులెత్తేసింది. దీంతో అప్పు చేసి షెడ్లు నిర్మించుకున్న రైతులు వడ్డీ చెల్లించేక నానా  తంటాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం పాడి రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మి నీ గోకులాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.’


మూడు కేటగిరీల్లో మంజూరు 

రెండు ఆవులకు రూ. లక్ష మంజూరు చేశారు. ఇందులో రైతుల పెట్టుబడి రూ. 10 వేలు. నాలుగు ఆవులకు రూ. 1.50 లక్షలు మంజూ  రుకాగా రైతుల నుంచి రూ 15 వేలు కట్టించారు. ఆరు ఆవులకు రూ. 1.80 లక్షలు మం జూరు చేశారు. రైతుల నుంచి రూ. 18 వేలు కట్టించారు. ఇప్పటికీ పైసా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.


 అట్లూరు 7, కమలకూరు 2, కామసముద్రం 4, కొండూరు 5, కుంభగిరి 3, మాడుపూరు 3, మణ్యంవారిపల్లి 26, మూత్తుకూరు 2, రెడ్డిపల్లి 1, తంబలగొంది 5, వరికుంట 4, వేమలూరు 4 మంజూరయ్యాయి.


ఇదీ పరిస్థితి..

నిర్మాణాలు ప్రారంభించిన రైతులంతా వీటని పూర్తి చేశారు. ఒక్క రూపాయి కూడా బిల్లు మంజూరు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులులిస్తుందనే ఉద్దేశంతోనే నిర్మించామని, నిర్మించాక మొండిచేయి చూపిందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.


అప్పు చేసి నిర్మించుకున్నాం..నాగం రాజమ్మ, అగ్రహారం

సంబందిత శాఖ అధికారులు ఆరు గేదెల కోసం రాయితీ రుణాన్ని మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పుచేసి ఆరు ఆవులకు రూ.1.80 లక్షతో షెడ్డు నిర్మించుకున్నా. ఇప్పటి ఇరకు రాయితీపై అధికారులు సమాధానం చేప్పలేదు. పాడి ఆవుల ద్వారా వచ్చే ఆదాయం వడ్డీలకే సరిపోతోంది. చెల్లించిన డీడీ మొత్తం,  బిల్లు కూడా రాలేదు. గేదెలు ఇతర  పశువులు అమ్ముకున్నా.  


బిల్లు మంజూరు చేసి ఆదుకోవాలి..భాస్కర్‌రెడ్డి, అగ్రహారం

అప్పు చేసి ఆరు ఆవులకు షెడ్లు నిర్మించుకున్నాము. తెచ్చిన అప్పునకు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నాము. షెడ్లు నిర్మించుకునే వరకు అధికారులు ఒత్తిడి చేశారు. నిర్మాణం పూర్తి చేశాక బిల్లు చెల్లించే ఊసే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. 

Updated Date - 2020-10-04T06:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising