కనువిందు చేస్తున్న జలపాతం
ABN, First Publish Date - 2020-10-04T05:52:52+05:30
మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన వెయ్యినూతుల కోనలో జలపాతం అందరినీ ఆకర్షిస్తోంది.
పెండ్లిమర్రి, అక్టోబరు 3 : మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన వెయ్యినూతుల కోనలో జలపాతం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొర్లడంతో కొండపై నుంచి జలపాతాన్ని చూసి భక్తులు ఆనందంగా గడుపుతున్నారు. ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునేందుకు శనివారం భక్తులు ఎక్కువగా వచ్చారు. జలపాతాన్ని చూసేందుకు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి మధ్యాహ్నం వంట వార్పు చేసుకుని పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నారు.
Updated Date - 2020-10-04T05:52:52+05:30 IST