ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

ABN, First Publish Date - 2020-10-01T06:32:04+05:30

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ తెలిపారు. బుధవారం దొరసానిపల్లె జడ్పీ హైస్కూలులో చేపట్టిన నాడు-నేడు పనులను ఆయన పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

\ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 30: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ తెలిపారు. బుధవారం దొరసానిపల్లె జడ్పీ హైస్కూలులో చేపట్టిన నాడు-నేడు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎంత మంది పిల్లలు ఉన్నారు, ఎంత మంది బడికి వస్తున్నారు అని తెలుసుకున్నారు.


నాడు-నేడు పనుల్లో భాగంగా ఆట స్థలంలో విద్యార్థులు ఆడుకోవడానికి వీలుగా కోర్టును ఏర్పాటు చేయాలని, విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లడానికి ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శైలజ, ఎస్‌ఎ్‌సఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఎ.ప్రభాకర్‌రెడ్డి, ఎంఈవో సావిత్రమ్మ, హెచ్‌ఎం కొండారెడ్డి, ఏఈ, డీఈ, పీఆర్‌పీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డీఈవో శైలజ వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూలు, తాళ్లమాపురం జడ్పీ హైస్కూళ్లలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు కాశీప్రసాద్‌రెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


పెనగలూరులో...

పెనగలూరు, సెప్టెంబరు 30: మండలంలో జరుగుతున్న నాడు-నేడు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద శిక్షణ కార్యక్రమాలను బుధవారం ఆర్‌జేడీ ఎం.వెంకటకృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగరాజపురం ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను హెడ్‌ టీచర్‌ శేషారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె.శివశంకర్‌రెడ్డి, తహసీల్దారు శ్రీధర్‌రావు, ఎంపీడీవో వరప్రసాద్‌, ఎంఈవో జయవేలు, ఆర్‌పీలు రాజశేఖర్‌రెడ్డి, శేషారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T06:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising