ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అనిల్‌కుమార్‌తో ఆకేపాటి భేటీ

ABN, First Publish Date - 2020-09-23T07:00:26+05:30

సోమశిల బ్యాక్‌వాటర్‌ను పెంచడం వల్ల రాజంపేట నియోజకవర్గంలో నీటమునిగిన గ్రామాలను, రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏపీ జలవనరుల శాఖామంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో ఆకేపాటి అమర్‌నాధరెడ్డి భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాజంపేట, సెప్టెంబరు22 : సోమశిల బ్యాక్‌వాటర్‌ను పెంచడం వల్ల రాజంపేట నియోజకవర్గంలో నీటమునిగిన గ్రామాలను, రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏపీ జలవనరుల శాఖామంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో ఆకేపాటి అమర్‌నాధరెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని మంత్రి క్యాంప్‌కార్యాలయంలో మంగళవారం కలిశారు. భారీ వర్షాలకు సోమశిలలో భారీ ఎత్తున నీరు నిల్వ చేశారన్నారు.


దీనివల్ల బ్యాక్‌వాటర్‌ పెరిగిపోయి ఒంటిమిట్ట, అట్లూరు, నందలూరు మండలాల్లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయని తెలిపారు. ఆకుతోటపల్లె, పొత్తపి, గంగపేరూరు, తప్పెటవారిపల్లె గ్రామాల్లో నివాసగృహాలకు ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.


అదే విధంగా తక్షణం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ముంపు గ్రామాలకు మంత్రి స్వయంగా వచ్చి సందర్శించి వారికి న్యాయం చేయాలని కోరారు. కడప మాజీ మేయర్‌ సురే్‌షబాబు, కడప జిల్లా వైసీపీ కార్యదర్శి కొండయ్య, అట్లూరు నాయకులు రామకృష్ణారెడ్డి, మాధవరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-23T07:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising