ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాసంలో అవినీతి కంపు..!

ABN, First Publish Date - 2020-08-06T10:08:46+05:30

పునరావాసంలో అవినీతి కంపు..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అర్హుల జాబితాలో బోగస్‌ పేర్లు

గెజిట్‌లో లేకున్నా ఎస్‌ఈఎస్‌ లిస్ట్‌లో స్థానం

ప్రజాధనం స్వాహాకు పక్కా ప్రణాళిక

తెర వెనుక ఓ కీలక అధికారి

గండికోట పునరావాస ప్యాకేజీ తీరు 


(కడప-ఆంధ్రజ్యోతి): గండికోట జలాశయంలో ఈ ఏడాది పూర్తిస్థాయి 26.85 టీఎంసీలు నిల్వ చేసేందుకు ప్రభుత్వం కొండాపురంతో పాటు ఏడు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. అందుకోసం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద రూ.668.81 కోట్లు మంజూరు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి. అయితే.. అర్హుల జాబితా తయారీలో అక్రమాలకు తెరతీశారు. గెజిట్‌ నిబంధనలను గండికోట జలాశయంలో కలిపేసి అనర్హులను జాబితాలో చేర్చారు. రూ.కోట్ల ప్రజాధనం స్వాహాకు స్కెచ్‌ వేశారు. అధికార పార్టీ నేతల అండతో ఓ కీలక అధికారి ఒకరు ఈ భాగోతానికి తెర తీశారని తెలుస్తోంది.


నిబంధనలు ఇవీ

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ నిబంధనల ప్రకారం 2007-10 మధ్య కాలంలో ముంపు గ్రామాల్లో నివాసం ఉన్నట్లు రేషన్‌ కార్డు లేదా ఓటరు జాబితాలో మూడేళ్లు పేరు, ఓటరు కార్డు కలిగి ఉండాలి. ఆ కుటుంబాల్లో 2017 సెప్టంబర్‌ 30వ తేది నాటికి 18 ఏళ్లు పైబడిన అందరికీ రూ.10 లక్షల పరిహారం ఇస్తారు. అలాగే.. ఇళ్ల నిర్మాణాల జాబితాలో పేరు ఉండి ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వాళ్లకు ప్రాజెక్ట్‌ ఎఫెక్టెడ్‌ ప్యామిలీ (పీఏఎఫ్‌) కింద కుటుంబంలో ఒకరికి మాత్రమే రూ.10 లక్షల పరిహారం అందుతుంది. 2007 నాటి గెజిట్‌ జాబితా, ఇళ్ల నిర్మాణాల జాబితా ఆధారంగా సోషల్‌ ఎకనామిక్‌ సర్వే (ఎస్‌ఈఎస్‌) చేసి అర్హుల తుది జాబితాను తయారు చేశారు. ఈ జాబితా తయారీలోనే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బోగస్‌ పేర్లు చేర్చారని, ఇందులో ఓ అధికారి కీలక పాత్ర ఉందనే అరోపణలు ఉన్నాయి.


ప్రజాధనం స్వాహాకు పక్కా ప్రణాళిక

పి.అనంతపురంలో 677 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రకారం రూ.67.70 కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ప్రభుత్వం మంజూరు చేసింది. 2007 సెప్టంబర్‌ 7న 383 మందికి చెందిన కట్టడాలు ముంపునకు గురి అవుతున్నాయని నాటి జిల్లా కలెక్టరు గెజెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాని ఆధారంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ నిబంధనలకు లోబడి ఎస్‌ఈఎస్‌ సర్వే చేసి అర్హుల జాబితా తయారు చేయాలి. అయితే అనర్హులను జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఊళ్లో ఇల్లు ఉండి ఇతర ప్రాంతాల్లో నివసించేవారికి పీఏఎఫ్‌ కింద కుటుంబంలో ఒకరికే పరిహారం ఇవ్వాల్సి ఉంటే ఆ కుటుంబంలో 18 ఏళ్లు పైబడిన వారందరి పేర్లు చేర్చారు. అంతేకాదు.. గెజిట్‌ జాబితాలో పేరు లేకపోయినా.. ఎస్‌ఈఎస్‌ జాబితాలో చేర్చారు. ఇలా దాదాపుగా ఈ ఒక్క గ్రామంలోనే 150-175కు పైగా బోగస్‌ పేర్లు చేర్చి రూ.కోట్లు ప్రజాధనం కొల్లగొట్టేందుకు చూస్తున్నారు. కొండాపురం, తాళ్ల పొద్దుటూరు గ్రామాల్లో కూడా దాదాపు వెయ్యికి పైగా బోగస్‌ పేర్లు చేర్చినట్లు సమాచారం. చామలూరు, ఎర్రగుడి, ఏటూరు, రేగడిపల్లి, కె.సుగుమంచిపల్లి గ్రామాల్లో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లేదా ఏసీబీ అధికారులతో సమగ్ర విచారణ చేయిస్తే పునరావాస ప్యాకేజీలో అవినీతి కంపు వెలుగులోకి వస్తుందని స్థానికులు అంటున్నారు.


బోగస్‌ పేర్లు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది - గౌతమి, జాయింట్‌ కలెక్టరు (రెవిన్యూ), కడప

గండికోట పునరావాస ప్యాకేజీ అర్హుల జాబితాలో బోగస్‌ పేర్లు చేర్చినట్లు మా దృష్టికి వచ్చింది. పి.అనంతపురం, కొండాపురం, తాళ్లప్రొద్దుటూరుతో పాటు మిగిలిన గ్రామాల్లో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరుగురు డిప్యూటీ తహశీల్దార్లతో సమగ్ర విచారణ చేయిస్తున్నాను. జాబితాలో అనర్హులను తొలగిస్తాం. ఎవరైనా అనర్హులు పరిహారం తీసుకుంటే రెవిన్యూ రికవరి యాక్ట్‌ ద్వారా కేసే నమోదు చేసి తీసుకున్న అమౌంట్‌ రికవరీ చేస్తాం. ఎవరినీ ఉపేక్షించను.


Updated Date - 2020-08-06T10:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising