కడప డీఎస్పీగా సునీల్ బాధ్యతలు
ABN, First Publish Date - 2020-11-18T05:05:29+05:30
కడప సబ్ డివిజనల్ డీఎస్పీగా మంగళవారం రాత్రి బి.సునీల్ బాధ్యతలు తీసు కున్నారు. 2018లో గ్రూప్-1లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు.
కడప(క్రైం), నవంబరు 17: కడప సబ్ డివిజనల్ డీఎస్పీగా మంగళవారం రాత్రి బి.సునీల్ బాధ్యతలు తీసు కున్నారు. 2018లో గ్రూప్-1లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. అనంతపురం, విశాఖపట్నం, తాడేపల్లె తదితర ప్రాంతాల్లో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వహించారు. జగ్గయ్యపేటకు చెందిన ఈయనకు మొదటి పోస్టింగ్‌ను కడప డీఎస్పీగా ఇచ్చారు.
ప్రజలకు అందుబాటులో ఉంటా
కడప సబ్ డివిజనల్ పరిధిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలందిస్తానని డీఎస్పీ సునీల్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, జూదం, బెట్టింగ్, తదితర వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
Updated Date - 2020-11-18T05:05:29+05:30 IST