ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనరేటర్‌ చోరీ కేసును.. 24గంటల్లోనే ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2020-08-02T17:25:59+05:30

డప నగరం ఆర్టీసీ బస్టాండు స్పెన్సర్స్‌ సమీపంలో రూ.7లక్షల విలువ చేసే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఆంధ్రజ్యోతి): కడప నగరం ఆర్టీసీ బస్టాండు స్పెన్సర్స్‌ సమీపంలో రూ.7లక్షల విలువ చేసే జనరేటరును దొంగలించిన కేసును 24గంటల్లోనే చిన్నచౌకు పోలీసులు చేధించారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించి వారినిఎట్టకేలకు మోడమీదపల్లెలోని దేవునికడప ఆర్చి వద్ద అదుపులోకి తీసుకుని జనరేటరును స్వాధీనం చేసుకున్నారు.


కడప చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. కడప అరవింద్‌నగర్‌కు చెందిన తుంగ శ్రీనివాసులరెడ్డి, కడప మృత్యుంజయకుంటకు చెందిన కొప్పుల రవిశంకర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు. గురువారం రాత్రి 2గంటల సమయంలో వారిరువురు స్పెన్సర్స్‌ షాపింగ్‌ మాల్‌ సమీపంలో ఖాళీ స్థలంలో ఉన్న జనరేటరును దొంగలించారు. దాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వాటర్‌గండికి పోయే సమీపంలోని పొలాల వాహనాన్ని నిలిపి ఉంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దొంగలను గుర్తించి వారిని విచారించగా వారు జనరేటర్‌ను చూపించినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.7లక్షలు విలువజేసే జనరేటరును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు ఆయన వివరించారు. 


సిబ్బందిని అభినందించిన కడప డీఎస్పీ

జనరేటర్‌ చోరీ కేసును 24గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేసిన సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణలతో పాటు సిబ్బందిని కడప డీఎస్పీ అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.


Updated Date - 2020-08-02T17:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising