ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంతకాన్ని ఫోర్జరీ చేశారు : ఎంపీడీవో

ABN, First Publish Date - 2020-09-26T22:05:53+05:30

సంతకాన్ని ఫోర్జరీ చేశారు : ఎంపీడీవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలసపాడు: నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు పక్కదారి పట్టించారని ఎంపీడీఓ జాన్‌వెస్లీ ప్రకటించారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘పాఠశాల ప్రహరీ నిధుల గోల్‌మాల్‌’ కథనంపై ఆయన స్పందిస్తూ పంచాయతీ సెక్రటరీ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని వివరించారు. బ్యాంకు అధికారులను చెక్కుల జిరాక్స్‌లు అందించాలని కోరినట్లు ఆయన తెలిపారు. దాదాపు నాలుగు చెక్కుల్లో రూ.6లక్షల పైచిలుకు నిధులను పంచాయతీ సెక్రటరీ సొంత అకౌంటుకు మళ్లించుకున్నారన్నారు. శంఖవరానికి సంబంధించి రూ.3.80లక్షలు, లింగారెడ్డిపల్లెకు రూ.లక్ష, చింతలపల్లెకు రూ.లక్ష నిధులు మూడో నెలలో విడుదల కాగా ఆరో నెలలో సొంత అకౌంట్లకు మళ్లించుకున్నారని తెలిపారు. అయితే ఈ పంచాయతీలకు ప్రత్యేకాఽ దికారిగా ఉన్న ఎంపీడీఓ జాన్‌వెస్లీ చెక్కులు ఏమయ్యాయో కూడా తెలుసుకోకపోవడం పలు విమర్శలకు, అనుమానాలకు తావిస్తోంది. పత్రికల్లో కథనం వచ్చిన తరువాత బ్యాంకు అధికారులను చెక్కుల జిరాక్స్‌లను ఇవ్వాలని ఎంపీడీఓ కోరడంపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. శుక్రవారం శంఖవరం పాఠశాల ప్రహరీ నిర్మించిన వారికి రూ.2లక్షల చెక్కు, రూ.3.07లక్షల డబ్బు నగదు రూపంలో ఇచ్చినట్లు ఎంపీడీఓ తెలిపారు. అయితే నిధులు అకౌంట్లకు చెక్కుల రూపేణా ఇవ్వాల్సిందే తప్ప నగదు రూపేణ ఎలా ఇస్తారని ప్రశ్నించగా, తప్పు జరిగిందని, నిధులను డ్రా చేసుకున్న పంచాయతీ సెక్రటరీ ప్రమాదవశాత్తు మరణించడంతో ఈ విధంగా ఇవ్వాల్సి వచ్చిందని ఆయన సమాధానమిచ్చారు. 

Updated Date - 2020-09-26T22:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising