ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవలకు జోహార్‌

ABN, First Publish Date - 2020-04-08T09:07:15+05:30

మహమ్మారి కోవిడ్‌-19ని తరిమికొట్టేందుకు పారిశుధ్య కార్మికులు అవిశ్రాంత సేవలు అందిస్తున్నారు. యుద్ధంలో సైనికుల్లా పోరాడుతూ పలువురికి స్ఫూర్తి నింపుతున్నారు. వారి సేవలకు జోహార్‌ అంటూ అన్ని వర్గాల ప్రజల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిశుధ్య పనుల్లో అలుపెరగని యోధులు

ప్రాణాలకు తెగించి సేవలు


కడప, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): మహమ్మారి కోవిడ్‌-19ని తరిమికొట్టేందుకు పారిశుధ్య కార్మికులు అవిశ్రాంత సేవలు అందిస్తున్నారు. యుద్ధంలో సైనికుల్లా పోరాడుతూ పలువురికి స్ఫూర్తి నింపుతున్నారు. వారి సేవలకు జోహార్‌ అంటూ అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కమ్మేసింది. జిల్లాలో కూడా 28 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో రాకపోకలు నిషేధం. అక్కడ ఉన్న వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, వైద్య సేవలను అక్కడికే వెళ్లి అందించేలా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అలాంటి ప్రాంతంలో పారిశుధ్య కార్మికులు సేవలందిస్తున్నారు. సోడియం హైడ్రోక్లోరైడ్‌ను వీధి వీధి తిరిగి పిచికారి చేసి వైరస్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రెగ్యులర్‌ పారిశుధ్య కార్యక్రమమైన రోడ్డు, మురుగు కాల్వలను శుభ్రపరుస్తున్నారు. కడప కార్పోరేషన్‌లో 101 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.


కడపలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 88 వార్డు సచివాలయాల పరిధిలో రెడ్‌జోన్‌ అమలులో ఉంది. అంటే కడప నగరం దాదాపు 89 శాతం రెడ్‌జోన్‌ పరిధిలో ఉంది. కార్పోరేషన్‌ పరిధిలో 179 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 664 మంది ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. బఫర్‌జోన్‌లో రోజూ పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యమే వారి ఆరోగ్యంగా భావిస్తూ నిర్విరామంగా సేవలందిస్తున్నారు. రెడ్‌జోన్‌ ఏరియాలో పనులు చేసేందుకు కొందరిలో భయం ఉన్నప్పటికీ విధి నిర్వహణే ముఖ్యంగా భావించి భయాన్ని పక్కన పెట్టేసి సేవలందిస్తున్నారు.

Updated Date - 2020-04-08T09:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising