ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనుల్లో ఇంత నిర్లక్ష్యమైతే ఎలా?

ABN, First Publish Date - 2020-10-24T11:19:43+05:30

నాడు-నేడు పనులు ప్రారంభమై ఇన్ని రోజులైనా పనులు పూర్తి చేయడంలో ఇంత నిర్లక్ష్యం అయితే ఎలాగని జేసీ సాయికాంత్‌వర్మ, ట్రైనీ కలెక్టర్‌ వికా్‌సమర్మాట్‌ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాఠశాలల ప్రారంభానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి

ఇంజనీరింగ్‌ అధికారులతో జేసీ, ట్రైనీ కలెక్టర్‌


కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 23 : నాడు-నేడు పనులు ప్రారంభమై ఇన్ని రోజులైనా పనులు పూర్తి చేయడంలో ఇంత నిర్లక్ష్యం అయితే ఎలాగని జేసీ సాయికాంత్‌వర్మ, ట్రైనీ కలెక్టర్‌ వికా్‌సమర్మాట్‌ ప్రశ్నించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కడప నగరంలో శుక్రవారం శాంతినగర్‌ డెమో పాఠశాలలో సమగ్ర శిక్ష జిల్లా పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పనులను పర్యవేక్షించారు. కొన్ని పనుల్లో ఉన్న లోపాలను సంబంధిత అధికారులకు చూపి వాటిని మార్చాలని ఆదేశించారు. ప్రధానంగా ఫుట్‌పాత్‌, ప్లేగ్రౌండ్‌ వంటి వాటిలో ఉత్తమ మెటీరియల్‌ వాడాలన్నారు. లేకుంటే పిల్లలు ఆడుకునే, నడిచే సమయంలో ఇబ్బందిగా ఉంటుందన్నారు. నవంబరు 2న పాఠశాలలు పునఃప్రారంభం కల్లా పూర్తి పనులు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమగ్ర శిక్ష పథక అధికారి అంబవరపు ప్రభాకర్‌రెడ్డి, ఏపీఈఐడబ్ల్యుడీసీ బి.జనార్ధన్‌రెడ్డిలను ఆదేశించారు. ఎంఈవో పాలెం నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌రెడ్డిలు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు, సీఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:19:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising