ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్మలమడుగులో బాంబుల కలకలం

ABN, First Publish Date - 2020-07-12T17:35:02+05:30

జమ్మలమడుగులో బాంబుల కలకలం రేగింది. ఈనెల 7వ తేదీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలస్యంగా వెలుగులోకి

ధ్రువీకరించిన పోలీసులు


జమ్మలమడుగు(కడప): జమ్మలమడుగులో బాంబుల కలకలం రేగింది. ఈనెల 7వ తేదీ జమ్మలమడుగు మండలంలోని పి.సుగుమంచిపల్లె గ్రామశివార్లలో నాపరాళ్ల గనుల సమీపాన ఓ రైతు పొలంలో మూడు బకెట్ల బాంబులు లభ్యమైనట్లు ప్రచారం జరిగింది. జమ్మలమడుగు అర్బన్‌ పోలీసులు అదేరోజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు సమాచారం.


పులివెందులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వస్తున్నందున పోలీసులు బాంబుల విషయాన్ని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఈనోటా ఆనోటా పడి జమ్మలమడుగులో బాగా ప్రచారం కావడంతో పోలీసు అధికారులు శనివారం సమాచారాన్ని బయటపెట్టారు. జమ్మలమడుగు అర్బన్‌ సీఐ మధుసూదన్‌రావు మాట్లాడుతూ సుగుమంచిపల్లె వద్ద ఒక బాంబు లభ్యమైందన్నారు. అక్కడ  ఇటీవల భూమిని చదును చేస్తున్నప్పుడు ఎక్సకవేటర్‌ ద్వారా మట్టిని తీస్తున్న సమయంలో పైపులు పగిలి ఒక బాంబు లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే కడప నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు నిర్వహించామని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2020-07-12T17:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising