ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం వివరాలు సేకరించండి

ABN, First Publish Date - 2020-12-02T04:55:21+05:30

ఇన్‌పుట్‌ సబ్సిడీ పరిహారం కోసం రైతుల వివ రాలను సేకరించాలని జేడీఏ మురళీకృష్ణకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

వేంపల్లె, డిసెంబరు 1: ఇన్‌పుట్‌ సబ్సిడీ పరిహారం కోసం రైతుల వివ రాలను సేకరించాలని జేడీఏ మురళీకృష్ణకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సూచించారు. వేంపల్లె మండల అభివృద్ధిపై స్థానిక సభా భవనంలో మంగళవారం ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి తదితరులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అయ్యవారిపల్లెలో దెబ్బతిన్న పంటల ను ఎంపీ, ఓఎస్డీలు పరిశీలించారు. 

ఎంపీకి వినతుల వెల్లువ

వేంపల్లె ప్రాంతంలో జ్యూస్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించాలని మాజీ గ్రంథాలయ చైర్మన్‌ మునిరెడ్డి ఎంపీని కోరారు. ము చ్చుకోన చెరువు లిఫ్ట్‌ పథకానికి సంబంధించిన పైప్‌లైన్‌ వేసిన భూములకు ఇంకా కొందరికి  పరిహారం అందలేదని, ఇప్పిం చాలని వినతిపత్రం అందించారు. స్థానిక బాలుర హైస్కూల్‌ ఆటస్థలంలో బాలికల హైస్కూల్‌ నిర్మాణం చేపట్టడంపై ప్రజ ల్లో అసంతృప్తి ఉందని, గతంలో ఉన్న స్కూల్‌ స్థానంలోనే నిర్మించాలని వక్ఫ్‌ బోర్డు మాజీ డైరెక్టర్‌ ఎంఎస్‌ దర్బార్‌ బాష ఎంపీకి విన్నవించారు. వేంపల్లె ఈఓ మల్లికార్జునరెడ్డిపై స్థానిక నిసార్‌ బాష, ఎంపీటీసీ చంద్రశేఖర్‌ ఎంపీకి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-12-02T04:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising