ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపద సృష్టించడం చేతగాక ధరల పెంపు

ABN, First Publish Date - 2020-06-28T07:19:53+05:30

ప్రజా ప్రయోజనాల సౌలభ్యం కోసం సంపద సృష్టించడం చేతగాక సీఎం జగన్‌ ధరలు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని టీడీపీ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌


కడప (నాగరాజుపేట), జూన్‌ 27 : ప్రజా ప్రయోజనాల సౌలభ్యం కోసం సంపద సృష్టించడం చేతగాక సీఎం జగన్‌ ధరలు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ ఆరోపించారు. అడుగడుగునా మోసం చేస్తూ ప్రజా వంచన పాలన సాగిస్తున్నారన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ ఛార్జీలు, మద్యం, పెట్రోధరలు పెంచి ఖజానా నింపుకుంటున్నారన్నారు. కేంద్రం యూనిట్‌ విద్యుత్‌ను రూ.2.70లకు అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.9 వసూళ్లు చేస్తోందన్నారు. జగన్‌ అఽధికారంలోకి రాగానే 31 శాతం ఉన్న వ్యాట్‌ను 37 శాతం చేశారన్నారు.


కరోనా విపత్తులో మూడు నెలలుగా పనులు, వ్యాపారాలు, ఆదాయం లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కరోనాపై పోరాటానికి ఏపీ చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కాపు రిజర్వేషన్‌ ప్రక్రియ మరుగునపెట్టడానికి కాపు నేస్తం తెచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులకు మాత్రం సంపద సృష్టిస్తూ కరోనాను వ్యాపారంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. సమావేశంలో మత్స్య శాఖ రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ రాంప్రసాద్‌, మాసా కోదండరామ్‌, రామాంజనేయులు, అనిల్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-28T07:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising