ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-16T05:20:49+05:30

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెల 25 నుంచి జనవరి 7 వరకు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరికిరణ్‌

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 15: పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ వీసీ హాలు నుంచి పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీ సరే ్వ, కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రణాళిక తదితర అంశాలపై జేసీలు గౌతమి, సాయికాంత్‌ వర్మ, డీఆర్వో మలోలతో కలిసి మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్‌ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 25 వతేదీ క్రిస్మస్‌ పండుగ నాటి నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు 14 రోజల పాటు ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి  కిస్మ్ర స్‌ రోజున పట్టాల పంపిణీని ప్రారంభించనున్నారన్నారు. నియోజకవర్గాన్ని ఒక్క యూనిట్‌గా తీసుకొని డివిజనల్‌ స్థాయి అధికారులు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీఓలు బాధ్యత తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించి అన్ని మండలాల పరిధిలోని ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ పనులు పెండింగ్‌ లేకుండా వెంటనే పూర్తి చేసి ప్లాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 18 తేదీ లోగా రెవెన్యూ డివిజన్‌లలోని పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు.  లే-అవుట్లలో ముళ్ల పొదలు, నీరు, బురద ఉంటే వెంటనే శుభ్రం చేయాలన్నారు. ఇప్పటికే డి-పారాల పట్టాల నమూనాలను ఆయా మండల తహసీల్దార్లకు పంపించినట్లు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను సిద్ధం చేయాలన్నారు. డి-ఫారం పట్టాతోపాటు లబ్ధిదారులకు పొజిషన్‌ సర్టిఫికెట్‌  ఒకే సారి ఇవ్వాలని కోరారు. అలాగే జగనన్న తోడు దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూరికార్డుల స్వచ్ఛీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్లు పృథ్వీతేజ్‌, కేతన్‌గార్గ్‌, ఆర్డీఓ నాగన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising