ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. మట్టిమిద్దె కూలడంతో..

ABN, First Publish Date - 2020-09-17T16:54:33+05:30

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కుందూ ప్రవాహం ఊరిచుట్టూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజుపాళెం(కడప): మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కుందూ ప్రవాహం ఊరిచుట్టూ ఉండడంతో నెమ్మెక్కిన మట్టిమద్దె కూలి దంపతులు మృతిచెం దారు. బుధవారం జరిగిన ఈ ఘటనతో రాజుపాళెం మండ లం కూలూరులో విషాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా..  బుధవారం తెల్లవారుజామున అయిదు గంటల సమయంలో మట్టిమిద్దె కూలింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గ్రా మ టీడీపీ నేత పెద్దిరెడ్డి శ్రీనివాసులరెడ్డి (52), భార్య సావిత్రి (44) అక్కడికక్కడే మృతిచెందారు. కూతురు హిమసాయి, మృతుని అమ్మ శంకరమ్మలకు ప్రమాదం తప్పింది.


ఈ ఘటనపై హిమసాయి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లక్ష్మినారాయణ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం ని మిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు. విషయం తెలిసి వీరి మృతదేహాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. శ్రీనివాసులరెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, టీడీపీ నేతలు ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డి, మండల టీడీపీ నేతలు పరామర్శించారు. 

Updated Date - 2020-09-17T16:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising