ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌సిగ్నల్‌

ABN, First Publish Date - 2020-05-27T09:56:26+05:30

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 65 రోజులుగా మూతబడ్డ బంగారు, వస్త్ర, పాదరక్షలు దుకాణాలు తెరుచుకోవచ్చని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వస్త్ర, పాదరక్ష, బంగారు షాపులు తెరుచుకోవచ్చు 

నిబంధనలతో కూడిన సడలింపులు : కలెక్టర్‌


కడప (కలెక్టరేట్‌),  మే 26: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 65 రోజులుగా మూతబడ్డ బంగారు, వస్త్ర, పాదరక్షలు దుకాణాలు తెరుచుకోవచ్చని కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. వ్యాపారుల ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం షాపులు తెరుచుకోవచ్చని అనుమతులను ఇచ్చిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. అయితే నిబంధనలను తప్పక పాటించాల్సి ఉంటుందని మార్గదర్శకాలను విడుదల చేశారు. 


షాపుల నిర్వహణకు విధి విధానాలు ఇవే...

బంగారు, వస్త్ర, పాదరక్షలు, హోటళ్ల వద్ద దుకాణదారులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రోత్సాహించాలి. ప్రతి షాపులో వచ్చి పోయే వినియోగదారుల వివరాలను నమోదు చేసేలా రిజిస్టర్‌ ఏర్పాటు చేయాలి. అలాగే వారి పేర్లు, ఫోన్‌ నెంబరు తప్పక నమోదు చేయాలి. పెద్ద దుకాణాల్లో సిబ్బందికి, వినియోగదారులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలి. 99 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి జ్వరం, కోవిడ్‌ లక్షణాలతో ఉన్న వారిని షాపుల్లోకి అనుమతించరాదు. ప్రతి కౌంటరులో శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. వినియోగదారులు వచ్చిపోయేటపుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. నగల దుకాణదారులు, సిబ్బందికి మాస్కులు, డిస్పోజల్‌ గ్లౌజ్‌లు ఇవ్వాలి. షాపుల్లో వస్త్రాలు ధరించే విధానాన్ని, నగలు ధరించడం అనుమతించరాదు.


ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలి. వాహనాల పార్కింగ్‌ సమయంలో వాహనదారుడు తగు జాగ్రత్తలు పాటించాలి. వీధి వర్తకులు పార్శిల్‌ పద్ధతిలో అమ్మకాలు సాగించాలి. గుర్తింపు కార్డులు ఉన్న వారే వీధుల్లో అమ్మకాలు చేపట్టాలి. మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి వీధి వ్యాపారులు అనుమతులు పొందాలి. వీధి వ్యాపారాలు నిర్వహించేటపుడు 5 మందికి మించి గుమికూడిఉండరాదు. కోవిడ్‌ లక్షణాలున్న వ్యాపారులను వీధి వ్యాపారాలకు అనుమతించరాదని కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2020-05-27T09:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising