ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో మానసికోల్లాసం

ABN, First Publish Date - 2020-08-10T11:17:55+05:30

నిరంతరం విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెన్నిస్‌ కోర్టు ప్రారంభోత్సవంలో ఎస్పీ అన్బురాజన్‌


కడప (క్రైం), ఆగస్టు 9: నిరంతరం విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో నూతనంగా అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేసిన టెన్నిస్‌ కోర్టును ఆదివారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, క్రీడా స్ఫూర్తి ముఖ్యమన్నారు.


క్రీడల్లో జిల్లా పోలీసులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అనంతరం టెన్నిస్‌ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ రుషికేశవరెడ్డి, కడప ఆర్డీవో మలోలా, ఎస్బీ డీఎస్పీ వంశీధర్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ సుధాకర్‌, 11వ బెటాలియన్‌ డీఎస్పీ షౌకత్‌ఆలీ, డీఎస్పీ రవికుమార్‌, సీఐలు వెంకటకుమార్‌, పుల్లయ్య, నరసింహులు, చంద్రశేఖర్‌, సత్యనారాయణ, అశోక్‌రెడ్డి, ఆర్‌ఐలు మహబూబ్‌బాషా, జార్జి, ఎస్‌ఐ వెంకటేశ్‌, ఏఆర్‌ ఎస్‌ఐలు స్వామినాయక్‌, శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T11:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising