నేటి నుంచి ఉచిత బియ్యం
ABN, First Publish Date - 2020-06-18T11:36:29+05:30
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి 28వ తేది వరకు కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున
కడప(కలెక్టరేట్), జూన్ 17: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి 28వ తేది వరకు కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి సౌభాగ్యలక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్లో ఉన్న ఒక్కో వ్యక్తికి 5 కేజీల బియ్యంతో పాటు, కార్డుకు కేజీ శనగలు ఇవ్వనున్నామని, కేవలం చక్కెరకు మాత్రమే డబ్బులు చెల్లించాలని తెలిపారు.
Updated Date - 2020-06-18T11:36:29+05:30 IST