ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు మాసాల విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలి

ABN, First Publish Date - 2020-05-15T09:27:35+05:30

లాక్‌డౌన్‌తో పనులు లేక, సంపాదన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నాలుగు మాసాల విద్యుత్‌ చార్జీలను మాఫీ చేయాలని పీసీసీ వర్కింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ చార్జీల పెంపుపై తులసిరెడ్డి నిరసన దీక్ష


వేంపల్లె, మే 14: లాక్‌డౌన్‌తో పనులు లేక, సంపాదన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నాలుగు మాసాల విద్యుత్‌ చార్జీలను మాఫీ చేయాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు కడప జిల్లా వేంపల్లెలోని తులసిరెడ్డి స్వగృహంలో కాంగ్రెస్‌ నాయకులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు నాలుగు మాసాల విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలని, జూలై నెల నుంచి పాత స్లాబ్‌ ధరలకే విద్యుత్‌ బిల్లులు వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు.


ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వానికి, పార్టీకి ప్రజలు షాక్‌ ఇస్తారని తులసిరెడ్డి హెచ్చరించారు. వడ్డింపులు, వాయింపుల ప్రభుత్వంగా వైసీపీ మారడం శోచనీయమని, ప్రజల అభీష్టం మేరకు పాలన సాగించాలని హితవు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం, చెన్నకేశవ, సుబ్బరాయుడు, నరసింహారెడ్డి, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-15T09:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising