రైతులు లేని రాష్ట్రంగా చేస్తున్న జగన్
ABN, First Publish Date - 2020-12-30T05:28:40+05:30
ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని రైతులు లేని రాష్ట్రంగా చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా దుయ్యబట్టారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా
రాయచోటిటౌన్, డిసెంబరు29: ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని రైతులు లేని రాష్ట్రంగా చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా దుయ్యబట్టారు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద రైతుల ఆత్మహత్యలపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి 579 రోజులైందన్నారు. ఈ 579 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 767 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఆయన తీసుకొచ్చారని ఆరోపించారు. రైతులు పూర్తిగా నష్టపోయినప్పటికీ అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ గ్రామాలు తిరిగి పంట నష్టంపై సక్రమంగా గణన చేసింది లేదన్నారు. ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర మంత్రులు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన భరోసా రాకుంటే వారి ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతులకు పంట నష్టం హెక్టారుకు రూ.40 వేలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్‌వలి, మండలశాఖ అధ్యక్షుడు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఇనాముల్లా, 7వ వార్డు అధ్యక్షుడు అతావుల్లా, 27వ వార్డు అధ్యక్షుడు మహబూబ్‌అలీఖాన్, సోనీరాజ్ ఖలీమ్, సాయి, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:28:40+05:30 IST