ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సొంత నియోజకవర్గానికి నీళ్లు.. నిర్వాసితులకు కన్నీళ్లా..?

ABN, First Publish Date - 2020-09-16T18:10:40+05:30

ముఖ్యమంత్రి జగన్‌ ప్రాతినిథ్యం వహించే సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి


కొండాపురం(కడప): ముఖ్యమంత్రి జగన్‌ ప్రాతినిథ్యం వహించే సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు కన్నీళ్లు తెప్పి స్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.10లక్షలు, ప్రకాశం జిల్లా నిర్వాసితులకు రూ.12.50లక్షలు చెల్లిస్తూ ఒకేరోజు పక్కపక్క జీవోలు విడుదల చేయడం వెనుక అంతర్యమేమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. తాళ్లప్రొద్దుటూరులో మంగళవారం 13వరోజు ఆందోళన కొనసాగించిన నిర్వాసితులకు ఆయన మద్దతు పలికారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకా రం నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలన్నారు. పునరావాస చట్టం ప్రకారం ఇళ్లు కట్టుకోవడానికి కనీసం రెండేళ్లు గడువు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లాలో ఎందుకూ పనికిరాని భూములకు అధిక ధర ఇచ్చిన ప్రభుత్వం తన సొంత జిల్లాలో మూడుకార్లు పండించే గండికోట రైతులకు అతి తక్కువ ధర చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిర్వాసితుల ఆందోళనకు సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, తెలుగు మహిళా కార్యదర్శి బషిరున్నీషా, మాజీ సర్పంచు నరసింహారెడ్డి, మండల సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు, ఏఐటీయూసీ కార్యదర్శి చాంద్‌బాషా, ఏఐవైఎఫ్‌ కార్యదర్శి సుధీర్‌ తదితరులు మద్దతు పలికారు.

Updated Date - 2020-09-16T18:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising