ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి ఆదిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-03-16T10:38:03+05:30

జమ్మ లమడుగు మండలంలోని దేవగుడి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన గొడవ ఘటనకు సం బంధించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ శివనాధరెడ్డితో పాటు పలువురిపై కేసులు


జమ్మలమడుగు రూరల్‌, మార్చి 15: జమ్మ లమడుగు మండలంలోని దేవగుడి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన గొడవ ఘటనకు సం బంధించి మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డితో పాటు ఎమ్మెల్సీ శివ నాధరెడ్డి, మరికొందరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద ఆదివారం కేసులు నమోదు చేశా రు. జమ్మలమడుగు అర్బన్‌ సీఐ మధుసూ దన్‌రావు ఆదివారం రాత్రి విలేకరులకు కేసు వివరాలు తెలిపారు. వైసీపీ నాయకుడు ఎం.రెడ్డయ్యతో పాటు ఆయన అన్న రామాం జనేయులు దేవగుడి గ్రామం ప్రధాన రోడ్డుపై ఉండగా ఆది అనుచరులు వారిని పట్టుకుని దేవగుడి గ్రామంలోకి తీసుకెళ్లారు. అక్కడ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, దేవగుడి జయరామిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలతో పాటు మరో 80 మంది కలిసి రాళ్లు, కర్రలతో వారిపై దాడి చేసి గాయపరి చారు. తీవ్రంగా గాయపడ్డ రెడ్డయ్యను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. రెడ్డెయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశా మని సీఐ తెలిపారు. 


అందులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ శివనాధ రెడ్డితో పాటు ఘటనలో పాల్గొన్న వారందరిపై ఐపీసీ సెక్షన్లు 143, 144, 147, 148, 323, 342, 188, 307 సెక్షన్లపై కేసు నమోదు చేశామని తెలిపా రు. అలాగే దేవగుడి గ్రామాన్ని ఏఆర్‌ అడిష నల్‌ ఎస్పీ రుషికేశవరెడ్డి, మరికొందరు అధి కారులు సందర్శించారని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-03-16T10:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising