ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజంపేట కోర్టులో నూతన భవనాల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-03-16T10:27:13+05:30

రాజంపేట కోర్టు ఆవరణలో నూతన భవనాల ఏర్పాటుపై కడప జి ల్లా కోర్టు పోలియో హైకోర్టు జడ్జి ఎం.వెంకటరమణ ఆరా తీశారు. ఆదివారం ఉదయం రాజంపేట కోర్టు ప్రాంగణానికి హైకోర్టు జడ్జి వచ్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిశీలించిన హైకోర్టు జడ్జి వెంకటరమణ


రాజంపేట, మార్చి 15 : రాజంపేట కోర్టు ఆవరణలో నూతన భవనాల ఏర్పాటుపై కడప జి ల్లా కోర్టు పోలియో హైకోర్టు జడ్జి ఎం.వెంకటరమణ ఆరా తీశారు. ఆదివారం ఉదయం రాజంపేట కోర్టు ప్రాంగణానికి హైకోర్టు జడ్జి వచ్చి స్థలాన్ని పరిశీలించారు. కోర్టు ఆవరణలో ఉన్న తహసీల్దారు కార్యాలయంతో పాటు అదనంగా 22 సెంట్లున్న గోడౌన్‌ను కూడా కోర్టుకు అప్పగించేందుకు జిల్లా అధికారులతో చర్చించారు. మొత్తం ఎకరా స్థలంలో నూతన భవనాలు ఏ ర్పాటు చేస్తే ఇక్కడ కొత్తకోర్టు ఏర్పాటవుతుంద ని తెలిపారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ గౌ తమితో మాట్లాడారు. కోర్టు ప్రాంగణం నుంచి తహసీల్దారు కార్యాలయం, గోడౌన్‌ స్థలాన్ని ప రిశీలించారు.


ప్రస్తుతమున్న తహసీల్దారు కా ర్యాలయాన్ని సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణానికి తరలించడం వల్ల కోర్టుభవనాల ఏర్పాటు సులభతరమవుతుందని రాజంపేట బార్‌ అ సోసియేషన్‌ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టు  జడ్జిదృష్టికి తీసుకువచ్చారు. ఎకరా స్థలం ఏర్పా టు కావడంవల్ల కొత్త భవనాల నిర్మాణం చేయడంతో ఇక కోర్టు కొత్త భవనాల సమస్య ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాస్‌, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, అదనపు జిల్లా జ డ్జి సత్యవాణి, సబ్‌ జడ్జి శ్రీనివాస్‌, మెజిస్ట్రేట్‌ ఫె ౖజున్నీసా, డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


హైకోర్టు జడ్జికి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో ఘన సన్మానం : హైకోర్టు జడ్జి వెంకటరమణను బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గురుప్రతా్‌పరెడ్డి, రామచంద్రనాయుడు, జానీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T10:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising