ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొప్పర్తిలో ఎలక్ర్టానిక్‌ క్లస్టర్‌

ABN, First Publish Date - 2020-08-20T11:50:22+05:30

కడప నగర శివార్లలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్‌ వస్తు తయారీ క్లస్టర్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు లక్ష్యం

మౌలిక వసతులకు రూ.750 కోట్లు

రాయచోటిలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు

వేంపల్లె డిగ్రీ కళాశాలకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు

సీఎం జగన్‌ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు


కడప, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : కడప నగర శివార్లలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్‌ వస్తు తయారీ క్లస్టర్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 10 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఈ క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నారు. గురువారం తాడేపల్లెలో సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కడప జిల్లా అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కొప్పర్తిలో ఎలక్ర్టానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్లస్టర్‌లో ఎలక్ర్టానిక్‌ రంగంలో కీలక పరిశ్రమలను ఆకట్టుకునే దిశగా మౌలిక వసతుల కల్పన కోసం రూ.730 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రివర్గం తీర్మానించింది. ప్రధానంగా 10 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టి లక్ష మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది ఈ క్లస్టర్‌ ప్రధాన ఉద్దేశ్యం. అలాగే రాయచోటి నియోజకవర్గం నుంచి శివారు గ్రామాల ప్రజలు పులివెందుల సబ్‌ డివిజన్‌ కార్యాలయానికి వెళ్లాలంటే 120 కిలోమీటర్ల దూరం అవుతుంది.


దీంతోపాటు రాయచోటి జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాయచోటి కేంద్రంగా పోలీసు సబ్‌ డివిజనల్‌ కార్యాలయం ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. డీఎస్పీ కార్యాలయంతో పాటు కొత్తగా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఇప్పటికే రూ.4.30 కోట్లు మంజూరు చేశారు. ఓ ప్రైవేట్‌ కళాశాల మైదానంలో ఈ కళాశాల నిర్మించనున్నారు. కళాశాల నిర్వహణ కోసం 27 టీచింగ్‌, 8 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేస్తూ క్యాబినెట్‌లో ఆమోదించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2020-08-20T11:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising