ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి విద్యుత్‌ స్లాబ్‌ను అమలు చేయాలి

ABN, First Publish Date - 2020-05-21T10:47:05+05:30

కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడి నడి విరుస్తూ జగన్‌ సర్కార్‌ విద్యుత్‌ చార్జీలు పెంచడాన్ని తీవ్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, మే 20 : కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడి నడి విరుస్తూ జగన్‌ సర్కార్‌ విద్యుత్‌ చార్జీలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, గతంలో ఫిబ్రవరి నెలలో వసూలు చేసిన విద్యుత్‌ స్లాబ్‌నే ఇప్పుడు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన పదినెలల కాలంలో రెండు సార్లు విద్యుత్‌ చార్జీలను పెంచారన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త స్లాబ్‌ను తీసుకొచ్చారని, దీని వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడిందన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో విద్యుత్‌ వినియోగం పెరిగిందని, కొత్త స్లాబ్‌తో పెద్దమొత్తంలో కరెంట్‌ బిల్లులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ చార్జీలను గతంలోలాగా వసూలు చేయాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. 


Updated Date - 2020-05-21T10:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising