ప్రభుత్వ కార్యాలయాల బిల్లులపై దృష్టి : సీఎండీ
ABN, First Publish Date - 2020-12-16T04:43:36+05:30
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయని వాటి వసూళ్లపై దృష్టిపెట్టి ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు విద్యుత్ అధికారులను ఆదేశించారు.
మైదుకూరు, డిసెంబరు 15: ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయని వాటి వసూళ్లపై దృష్టిపెట్టి ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు విద్యుత్ అధికారులను ఆదేశించారు. డీఈఈ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధి మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గంలోని పలు మం డలాల ఏఈలు, ఇంజనీర్లతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ వేసవిలో అంతరాయం లేకుండా రైతులకు విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు కోట్ల రూపాయలు పేరుకుపోయాయని వాటికి వడ్డీ వస్తూ ప్రభుత్వాదాయానికి గండి పడుతోంద న్నారు. ఎస్‌ఈ శ్రీనివాసులు, ఈఈ వెంకట రామిరెడ్డి, ఏఈ హరిబాబు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T04:43:36+05:30 IST