ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ బిల్లులపై అపోహలొద్దు

ABN, First Publish Date - 2020-05-14T10:44:00+05:30

విద్యుత్‌ బిల్లులపై వినియోగదారులెవ్వరికీ అపోహలొద్దని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన తన నివాసంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి


రాయచోటిటౌన్‌, మే 13: విద్యుత్‌ బిల్లులపై వినియోగదారులెవ్వరికీ అపోహలొద్దని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన తన నివాసంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసులు, డీఈ బ్రహ్మానందరెడ్డి, ఏడీలు, ఏఈలతో విద్యుత్‌ బిల్లులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులపైన ఎటువంటి భారం మోపలేదన్నారు.


ఫిబ్రవరి మాసం బిల్లులను మామూలుగా చెల్లించారని, మార్చి బిల్లుకు ఫిబ్రవరిలో ఎంత చెల్లించారో అంతే చెల్లించాలని, మార్చి, ఏప్రిల్‌ మాసాలు, మే 12న రీడింగ్‌ తీశారని, మార్చికి సంబంధించిన 22 రోజుల బిల్లును సెపరేట్‌  చేశారని, తరువాత ఏప్రిల్‌ ది మే 10 వరకు సెపరేట్‌ చేశారని, 60 రోజులకు గాను 22 రోజులు ఒక బిల్లుగాను, 38 రోజులు ఒక బిల్లుగాను వచ్చాయ ని, రెండు బిల్లులు కలపలేదని అధికారులు చీఫ్‌ విప్‌ దృష్టికి తీసుకువచ్చారు. బిల్లుల విషయంలో తప్పులు ఉంటే సరిదిద్దుతామన్నారు. కాగా  ఆగస్టు 15 లోగా గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ డీఈకి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డిసూచించారు. సచివాలయ భవన నిర్మాణాల స్థితిగతులపై ఆయన ఆరాతీశారు. 

Updated Date - 2020-05-14T10:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising