ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలపై అదనపు భారం వద్దు

ABN, First Publish Date - 2020-05-19T11:17:17+05:30

ప్రజలపై విద్యుత్‌ చార్జీల అదనపు భారం మోపడం సరికాదంటూ సోమవారం కడప నగరంలోని విద్యుత్‌ భవన్‌ ఎస్‌ఈ కార్యాలయం వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు నెలల విద్యుత్‌ చార్జీలు తక్షణమే రద్దు చేయాలి

అఖిలపక్షాల డిమాండ్‌

విద్యుత్‌ భవన్‌ ఎస్‌ఈ కార్యాలయం వద్ద నిరసన

నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు

ప్రొద్దుటూరులో డిప్యూటీ సీఎంకు వినతి


కడప (మారుతీనగర్‌), మే 18: ప్రజలపై విద్యుత్‌ చార్జీల అదనపు భారం మోపడం సరికాదంటూ సోమవారం కడప నగరంలోని విద్యుత్‌ భవన్‌ ఎస్‌ఈ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భగా నేతలు మాట్లాడుతూ... కరోనా కష్టకాలంలో పేద, మధ్యతరగతి ప్రజలు బతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తుంటే దొడ్డిదారిన ఏప్రిల్‌ 1 నుంచి విద్యుత్‌ చార్జీలను పెంచడం దుర్మార్గ చర్య అన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీల ప్రజానీకానికి దోబీ, బార్బర్‌ తదితర వృత్తిదారులకు ఇచ్చే విద్యుత్‌ రాయితీలను కూడా ఎత్తివేయడం విచారకరమన్నారు.


కాంట్రాక్టర్లకు కోట్లలో బిల్లులు చెల్లిస్తూ విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే  రెండు నెలల విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష పార్టీల నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, అమీర్‌బాబు (టీడీపీ), ఈశ్వరయ్య (సీపీఐ), సత్తార్‌ (కాంగ్రెస్‌), ఓబయ్య (సీపీఐ ఎంఎల్‌), సగిలి గురప్ప (బీఎస్పీ), సంఘ సేవకులు సయ్యద్‌ సలావుద్దీన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-19T11:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising