ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట రుణాల రెన్యూవల్స్‌లో ఇబ్బంది పెట్టద్దు

ABN, First Publish Date - 2020-05-29T11:26:40+05:30

వ్యవసాయ పంట రుణాల రెన్యూవల్‌ కోసం వచ్చే రైతులకు ఇబ్బందులు పెట్టద్దని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంక్‌ అధికారులతో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి


రాయచోటిటౌన్‌, మే 28: వ్యవసాయ పంట రుణాల రెన్యూవల్‌ కోసం వచ్చే రైతులకు ఇబ్బందులు పెట్టద్దని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి బ్యాంక్‌ అధికారులకు సూచించారు. గురువారం ఆయన పట్టణంలోని ఎస్‌ఎన్‌కాలనీలో గల స్టేట్‌బ్యాంక్‌ శాఖను సందర్శించి అక్కడ రుణాల రెన్యూవల్‌ కోసం వచ్చిన రైతులు, ఖాతాదారులు, బ్యాంకు అఽధికారులతో మాట్లాడారు. రుణాల రెన్యూవల్‌ కోసం వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని బ్యాంక్‌ అదికారులను కోరారు. వైఎ్‌సఆర్‌ నేతన్న నేస్తం అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని, చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకు లు అప్పాజీకి సూచించారు. జూన్‌ 17న మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తారన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.10 లక్షల విలువజేసే చెక్కును పట్టణానికి చెందిన మయానా అబిద్‌అలీఖాన్‌ కుటుంబానికి ఆయన అందజేశారు. మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఆవుల విష్ణువర్థన్‌రెడ్డి, వైసీపీ నేతలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆసి్‌ఫఅలీఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T11:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising