ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండి క్షేత్రంలో దేవదాయ శాఖ స్తపతి పర్యటన

ABN, First Publish Date - 2020-12-29T05:09:06+05:30

గండిక్షేత్రంలో సోమవారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప పర్యటించారు.

పనులను పరిశీలిస్తున్న పరమేశ్వరప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, డిసెంబరు 28: గండిక్షేత్రంలో సోమవారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప పర్యటించారు. సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌, సహాయ స్తపతి పాండురంగస్వామి, డీఈ గంగయ్యతో కల సి ఆయన ఆలయంలో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఇటీవల గండి క్షేత్రానికి రూ.14.50కోట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో పాటు శిలాఫలకం ఆవిష్కరించి నెల రోజుల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు అంతరాలయం, గర్భాలయం, మహామండపం గ్రానైట్‌ రాతితో పునర్నిర్మాణం చేసేందుకు ఆయన పరిశీలించారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఈ పనులను ఆగమశాస్త్ర ప్రకారం చేయాల్సి ఉంది. వీటికి కావాల్సిన సాంకేతిక ఉత్తర్వుల నిమిత్తం వారంలోగా ప్లాన్‌ వేసి ఎస్టిమేషన్లు తయారు చేసి కమిషనర్‌ కార్యాలయానికి పంపాల్సి ఉంది. శరవేగంగా పనులు చేపట్టనున్నారు. టెక్నికల్‌ పనుల మంజూరు కోసం అన్ని విధాలా చొరవ చూపుతున్నట్లు సహాయ కమిషనర్‌ గురుప్రసాద్‌ తెలిపారు. అలాగే పనులు త్వరలో చేపడుతామన్నారు.  


ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు


గండి వీరాంజనేయస్వామి ఆల యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు సోమవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశా యి. సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్‌, ఆగమపండితులు అనంత దీక్షితులు, రామ్మోహన్‌శర్మ వేదపండితులచే పూజలు నిర్వహించారు. దేవాలయంలో ఏమైనా అపచారాలు జరిగి ఉంటే పవిత్రోత్సవాలతో తొలగిపోయి దేవుడికి ఆయుష్షు పెరుగుతుందని వేదపారాయణ పండితులు అనంత దీక్షితులు తెలిపారు. కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు రాజ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising