ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో పందుల కాపరి మృతి

ABN, First Publish Date - 2020-11-16T05:04:50+05:30

తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన డేరా బాలన్న (60)అలియాస్‌ ఎర్రన్న ఆదివారం గండికోట బ్యాక్‌వాటర్‌లో పడి మృతిచెందాడు.

డేరా బాలన్న మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, నవంబరు 15: తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన డేరా బాలన్న (60)అలియాస్‌ ఎర్రన్న ఆదివారం గండికోట బ్యాక్‌వాటర్‌లో పడి మృతిచెందాడు. పోలీసులు, బంధువుల వివరాల మేరకు.. బాలన్నకు స్థానిక అంకాళమ్మ ఆలయం సమీపంలో మూడు ఇళ్లు ఉన్నాయి. ఇతనికి సంబంధించిన (ఇంటి నంబర్లు టి506, టి507, టి508) ఇళ్లకు పరిహారం అందలేదు. ఇళ్లతో పాటు తన పందుల షెడ్డు కూడా బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయింది. తనకు పరిహారం అందలేదని గతంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డితో కలిసి కలెక్టర్‌కు విన్నవించారు. పరిహారం అందకపోవడంతో తీవ్ర ఆందోళన చెందేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం బ్యాక్‌వాటర్‌లో మునిగిన పందులషెడ్డును తీసి మరోచోటికు మార్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్లలో మునిగిన పందుల షెడ్డును చూసి ఆవేదనతో గుండెపోటుకు గురై మృతిచెందాడని బంధువులు పేర్కొన్నారు. కాగా పందుల షెడ్డును ఊడగొట్టేందుకు వెళ్లి వస్తూ నీళ్లలో ఊపిరాడక మృతిచెందాడని తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ విద్యాసాగర్‌ తెలిపారు. ఇతనికి ఇద్దరు భార్యలు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2020-11-16T05:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising