ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్ష పార్టీ పర్యటిస్తే దాడులా..?

ABN, First Publish Date - 2020-12-14T04:51:45+05:30

ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీ పర్యటిస్తే పాలకులు దాడులకు పాల్పడటం అప్రజాస్వామ్యమని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు  

చిట్వేలి, డిసెంబరు13 : ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీ పర్యటిస్తే పాలకులు దాడులకు పాల్పడటం అప్రజాస్వామ్యమని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిధిలోని తిమ్మయ్యగారిపల్లెలో ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లెలో ప్రతిపక్ష పార్టీ నాయకులను అడ్డుకుని దాడులకు దిగడం చాలా దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి,   శ్రీనివాసరెడ్డి వెళ్లుతున్న వాహనాలను అడ్డుకోవడం దారుణమన్నారు. ఇటువంటి దాడులకు పాల్పడటం హ్యేయమైనచర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.            ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కె.కె.చౌదరి, ఓబులవారిపల్లె అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, మాజీ సర్పంచ్‌ సుబ్బరాయుడు, నరసింహులు, ఏదోటి రాజశేఖర్‌, హరి, గురునాధ్‌, గోవిందయ్య, దళిత నాయకులు రమేష్‌, చిన్న, చంద్రమౌళి, యువ నాయకులు బాలకృష్ణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T04:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising