ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టం వివరాలు పంపండి

ABN, First Publish Date - 2020-12-06T04:53:16+05:30

నివర్‌ తుఫాను వలన నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించి వేగవంతంగా పంట నష్టం వివరాలు పంపించాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యవసాయాధికారులకు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 5: నివర్‌ తుఫాను వలన  నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించి వేగవంతంగా పంట నష్టం వివరాలు పంపించాలని  ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యవసాయాధికారులకు సూచించారు. శనివారం జమ్మలమడుగు నగర పంచాయతీ కార్యాలయ సభాభవనంలో నియోజకవర్గానికి సం బందించి ఆరు మండలాల వ్యవసాయాధికారులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్న రైతుల పొలాలను అధికారులు పరిశీలించి  రైతులు ఇబ్బంది పడకుండా నష్ట వివరాలు పంపాలన్నారు. అవసరమైతే అన్ని మండలాల్లో, గ్రామాల్లో వైసీపీ నాయకుల సహాయ సహకారాలు కూడా తీసుకుని రైతులకు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు మాట్లాడుతూ అన్ని మండలాల్లో ఇప్పటికే రిపోర్టు సుమారు పూర్తయిందన్నారు. ఈనెల 15వ తేదీలోగా అంచనాలు వేసి ఉన్నతాధికారులకు ఇవ్వాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ సలహామండలి కమిటీ ఛైర్మన్‌ సంబటూ రు ప్రసాద్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ శివగురివిరెడ్డి, పట్టణాధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, వ్యవసాయాధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising